కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో పెద్ద స్కాం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ విమర్శలు గుప్పించారు. తమ హయాంంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి.. అందులో స్కాం చేశారని ఆరోపించారు. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం కావడంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మంత్రి లోకేశ్ శాఖలో “డార్క్ ఆపరేషన్” సాగిందని.. దీన్ని బయటపెట్టకుండా ప్రభుత్వం దాచి పెడుతోందన్నారు.

