విజయవాడలో నిర్వహించిన ‘ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సందర్శించి, స్టార్టప్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం 38 పారిశ్రామిక పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 550 ఇండస్ట్రియల్ పార్కులు ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేసి పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పిస్తామని తెలిపారు.