ఇరాన్‌తో శాంతి చర్చలు మరియు చమురు సరఫరా పునరుద్ధరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యు-టర్న్ తీసుకున్నారు. ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దాదాపు ఖరారైందని ఆదివారం ప్రకటించిన ఆయన.. అంతలోనే ఆ మాటకు భిన్నంగా వ్యవహరిస్తూ సరికొత్త సంచలనానికి తెరలేపారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం ఇంకా ప్రాథమిక చర్చల దశలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ చేసిన పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.