గోదావరి పుష్కరాల సన్నద్దతపై అధికారులు సీఎం చంద్రబాబుకు వాస్తవాలు చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ అసంతృప్తి వ్యక్తం చేసారు. గోదావరి జిల్లాల్లో ఆశించిన రీతిలో పుష్కరాల పనులు జరగడం లేదని..ఇప్పటివరకు పనులకు డీపీఆర్‌లు, ప్రణాళికలు పూర్తిస్థాయిలో లేకపోవటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. హడావుడిగా కూలిపోయే పనులు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రణాళిక లేకుండా అడిగితే .. ప్రధాని మోదీ నిధులు ఇవ్వరని పవన్ చెప్పుకొచ్చారు.