కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో ఈ ఒక్క ఘటననే చూస్తే అర్థమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పాలనలో కుటుంబ సభ్యులే మృతదేహాలను భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి రావడం బాధాకరం మాత్రమే కాదు.. తెలంగాణ ఆత్మగౌరవానికే మచ్చ అని విమర్శించారు.ప్రచారాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రభుత్వం.. సభలు, హెలికాప్టర్ల కోసం ప్రజల డబ్బు వెచ్చించే ప్రభుత్వం.. అదే ప్రజలకు అవసరమైన కనీస అత్యవసర సేవలు అందించలేకపోవడం సిగ్గుచేటు కాదా అని ప్రశ్నించారు