భారతదేశ పర్యటనలో భాగంగా మూడో రోజు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సోమవారం ఆగ్రాలోని చారిత్రిక కట్టడం తాజ్ మహల్‌ను తన భార్య జీనెట్ రూబియోతో కలిసి చారిత్రాత్మక తాజ్ మహల్‌ను సందర్శించారు. ఆ కట్టడాన్ని ప్రపంచ సంపదలలో ఒకటిగా కొనియాడారు. వారు తాజ్ మహల్ వద్ద సుమారు గంటన్నర సేపు గడిపారు. సందర్శకుల పుస్తకంలో “ప్రపంచపు నిజమైన సంపదలలో ఒకటైన తాజ్ మహల్‌ను సందర్శించేందుకు మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు” అని రాశారు.