దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మోడల్ త్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించనున్నట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు అధికారికంగా తెలియజేశారు. సీబీఐ ఈ కేసును స్వీకరించి పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికను సమర్పించేంత వరకు.. మీడియా సంస్థలు అత్యంత ఓపికతో, సంయమనంతో వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది. బాధితుల వ్యక్తిగత బాధను కేవలం వార్తా విశేషాలుగా మార్చవద్దని,ఎవరిపై అయినా నేరస్తులనే ముద్ర వేసేలా
మీడియా ట్రయల్స్ జరగడం సరికాదు హితవు పలికింది