జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆయనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. జానీ మాస్టర్, సుమలత వివరణతో సంతృప్తి చెందిన ఫెడరేషన్.. ఈమేరకు నిర్ణయం తీసుకుంది. నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని.. రెండు రోజుల క్రితం జానీ మాస్టర్కు ఫిల్మ్ ఫెడరేషన్ సహాయ నిరాకరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ కూడా రంగంలోకి దిగడంతో ఈ వివాదం పరిష్కారమైంది.