తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. దానంగా అందించిన తొమ్మిదేళ్ల వయస్సు గల మగ గుర్రం శనివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ వెల్లడించారు గోశాలకు వచ్చినప్పటి నుంచే మేత, నీరు సరిగా తీసుకోకపోవడం, తరచూ కూర్చోవడం, పడుకోవడం, దొర్లడం, మళ్లీ లేవడం వంటి అస్వస్థత లక్షణాలు కనిపించాయని అధికారులు వెల్లడించారు. ఈ గుర్రం జూలై 13న గోసంరక్షణశాలకు చేరిన వెంటనే వైద్య పర్యవేక్షణలో చికిత్స అందించారు.