జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు సింధును అభినందిస్తూ ఎక్స్‌లో పోస్టులు చేశారు. సింధు వీరందరికీ బదులిచ్చింది.ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి బదులిస్తూ..థ్యాంక్యూ సో మచ్ సర్, మనం ఇద్దరికీ ఒకే డాక్టర్ (దిన్షా) ఉన్నారు,మంచి డాక్టర్ దగ్గర చికిత్స పొందుతున్నారు. మీరు పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ సింధు బదులిచ్చింది.