హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణికి, తోటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి కొంతకాలంగా అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. తన ప్రైవేట్ వీడియోలను తీసి భర్తకు పంపినట్లుగా సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. గదిలోకి బలవంతంగా లాక్కెల్లి లైంగిక వేధింపులకు
పాల్పడ్డాడని సదరు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఉన్నతాధికారుల శిక్షణా కేంద్రంలోనే ఇలాంటి ఘటన వెలుగుచూడటం పోలీస్ శాఖలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.