ముంబై ఛారిటీ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సల్మాన్ ఖాన్‌ను చూసిన ఫ్యాన్స్ చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆయనకు ఏమైందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తారు. ఒకప్పుడు ఫిట్‌గా కనిపించే సల్మాన్, ఈసారి ముసలితనంగా ఎందుకు కనిపిస్తున్నారని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆయనకు గతంలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యల గురించి కూడా ఫ్యాన్స్ భయం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆయన లుక్‌ను చూసి ఆందోళన చెందగా, మరికొందరు వయసు సహజమని సమర్థించుకుంటున్నారు.