అమెరికా తన దాడులను తక్షణమే ఆపకపోతే కోలుకోలేని విధంగా బుద్ధి చెబుతామని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన శాంతి ఒప్పందానికి ఎలాంటి విలువ లేదని, అది నిష్ప్రయోజనమని కొట్టిపారేశారు. ఆ దేశంతో ఉన్న ఒప్పంద హామీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్, ఇరు దేశాల మధ్య శనివారం కూడా పరస్పర దాడులు కొనసాగాయి. ఈసారి వ్యూహాత్మక రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధితో పాటు మంచినీటి వనరులను ఇరుపక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి.