అమెరికా మహిళల బాక్సింగ్‌లో రాణిస్తున్న హన్నా రాప్ దుర్మరణం చెందింది. జూలై 18, శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల హన్నా కన్నుమూసింది. టెక్సాస్‌లో సైకిల్ తొక్కుతుండగా ఓ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. దాంతో, తీవ్రంగా గాయపడిన హన్నా ప్రాణాలు కోల్పోయింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఇద్దరు సైక్లిస్టులను దాటి హన్నా సైకిల్‌ను తాకింది. ప్రమాదం తీవ్రతకు రక్తమోడిన బాక్సర్‌కు వెంటనే ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తీసకెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ హన్నా ప్రాణాలు విడిచింది.