బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు 50 సార్లు ప్రయత్నించాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గోవింద్ నగర్‌లోని గుజైని ప్రాంతంలో నివసించే 23 ఏళ్ల ఆనంద్ 2024లో బీటెక్ లో టాపర్‌గా నిలిచాడు. చేతిరాతతో ఉన్న ఐదు లైన్ల లేఖ కూడా పోలీసులకు లభించింది. ‘క్షమించండి నాన్నా, ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను. కానీ విజయం సాధించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి’ అని రాసి ఉంది.