జాతీయ గేయం ‘వందేమాతరం’ ని అవమానించినా, ఆలపిస్తున్న సమయంలో ఆటంకం కలిగించినా ఇకపై చట్టరీత్యా నేరంగా పరిగణించనున్నారు. ఈ మేరకు పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజే (సోమవారం) ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ (సవరణ)-2026’ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.