గురువారం కర్నూలులో పర్యటించిన వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్, పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసి సమయంలో అధికారులు అవమానించారని ఆరోపించారు. దీన్ని అధికారులు ఖండించారు. ఎవరు ములాఖత్‌కు వచ్చినా పాటించే ప్రక్రియనే అమలు చేశామని తేల్చి చెప్పారు. అంతే కానీ అవమానకరంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్పష్టం చేశారు. ములాఖత్ మాట్లాడే సమయంలో గానీ, గేటు బయట సందర్శకుడిగా ఫోటో దిగే సమయంలో గానీ ఆయనతో ఏ అధికారిగానీ, సిబ్బంది గానీ అమర్యాదగా ప్రవర్తించలేదని. కర్నూలు జిల్లా జైలు పర్యవేక్షణాధికారి వేణుగోపాల్‌్ రెడ్డి ఒక ప్రకటన జారీ చేశారు.