దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 3న జరిగిన నిరసనను కవర్ చేస్తున్న ముగ్గురు మహిళా జర్నలిస్టులు పోలీసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. బాధితురాళ్లలో ఒక మహిళా జర్నలిస్ట్.. ఓ ACP తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. తాను పోలీసుల చర్యలను వీడియో తీస్తున్న సమయంలో ఆ అధికారి తనను అసభ్యంగా తాకి పక్కకు నెట్టేశారని ఆమె పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పటికీ వెంటనే కేసు నమోదు చేయలేదని ఆమె ఆరోపించారు.