కాక్రోచ్ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేజీపీ తలపెట్టిన ‘ఛలో పార్లమెంట్’కు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. జూలై 20, సోమవారం నాడు ఛలో సంసద్ (ఛలో పార్లమెంట్) కోసం ఎవరూ తమ అనుమతి కోరలేదని, పోలీసులు ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున సీజేపీ తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.