NEET-UG పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది పలువురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీకి చెందిన రితిక్ మిశ్రా గురువారం (మే 14) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడోసారి నీట్ రాసిన రితిక్ నీట్ పరీక్ష రద్దవడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు. రాజస్థాన్‌లోని సీకర్‌లో పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా నీట్ కోసం సన్నద్ధమవుతున్న 20 ఏళ్ల యువతి వాయువ్య ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.