కోలీవుడ్ దళపతి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన జోసెఫ్ విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన చిరంజీవి.. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి వచ్చి, తమిళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత ముఖ్యమంత్రి, లెజెండరీ నటుడు ఎంజీఆర్ ప్రస్తావనను చిరంజీవి తీసుకొచ్చారు. ఎంజీఆర్ లాగే విజయ్ కూడా ప్రజాకేంద్రీకృత పాలనతో ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోవాలని చిరంజీవి ఆకాంక్షించారు.