మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా డిజిటల్ స్పేస్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన ఓ టాక్ షో చేస్తున్నారు. చిరంజీవి వ్యాఖ్యాతగా ‘మెగావర్స్’ అనే పేరుతో టాక్ షో రాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. ”మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్.. మెగాస్టార్ వచ్చేస్తున్నారు” అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ను పంచుకుంది. గ్రాండ్ సెటప్ తో ఓ ఛైర్ కనిపించేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు.