క్విట్ ఇండియా ఉద్యమం (భారత్ విడిచి పో ఉద్యమం) అనేది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, 1942 ఆగస్టు 8న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బొంబాయి సమావేశంలో మహాత్మా గాంధీ ప్రారంభించిన రాజకీయ ఉద్యమం. దీని ప్రధాన లక్ష్యం భారతదేశంపై బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని డిమాండ్ చేయడం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ గాంధీ పేర్కొన్న “భారతదేశం నుండి బ్రిటిష్ వారు క్రమబద్ధంగా వైదొలగాలి” అనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా సామూహిక నిరసన ఉద్యమాన్ని ప్రారంభించింది.