డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జానీ మాస్టర్ సతీమణి సుమలతకు ఊహించని షాక్ తగిలింది. డాన్సర్స్ అసోసియేషన్‌పై ఫిల్మ్ ఫెడరేషన్ కీలక ప్రకటన చేసింది. అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ఫెడరేషన్ వెల్లడించింది. ప్రెసిడెంట్ సుమలత తీరును ఎండగడుతూ ఫెడరేషన్ లేఖను విడుదల చేసింది. చిరంజీవి, ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్‌కు వ్యతిరేకంగా సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఫెడరేషన్ ఆరోపిస్తుంది. మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా సహాయం ఉండదని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.