తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి వసూలు చేసే పాఠశాల ఫీజుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను
పాఠశాల నోటీసు బోర్డులో అందరికీ కనిపించేలా ఉంచాలని విద్యాశాఖ సూచించింది. అలాగే పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పాఠశాల విద్యాశాఖ పోర్టల్‌లో కూడా ఫీజుల వివరాలను నమోదు చేయాలని ఆదేశించింది.