అక్టోబర్ నెలలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా తెలిపారు.
డిసెంబర్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.అమరావతి సచివాలయంలో విలేకర్లతో మాట్లాడిన తమీమ్ అన్సారియా.. డీఎస్సీ 2025పై వస్తున్న ఆరోపణలను ఖండించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించామన్నారు. అయినప్పటికీ డీఎస్సీ 2025పై నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని.. ఆందోళనకు గురికావద్దని సూచించారు.