పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి.’మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ పేరిట మూడు దేశాలు త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి.ఇందులో భాగంగా ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణించనున్నాయి.సౌదీ లోని మక్కాలో జరిగిన సమావేశంలో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్లు సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశారు.