రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ ను ఢీకొట్టిన ఘటనలో నిందితులైన సురవరపు దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆగస్టు 3న ప్రసాద్ ఆదిత్యమాల్ గేటు వద్ద మద్యం మత్తులో ఉన్న నిందితులు కారును నిర్లక్ష్యంగా నడుపుతూ బైకుపై వెళ్తున్న మెడికల్ స్టూడెంట్స్ ప్రియాంక, ఉమేష్లను ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు.