మధ్యప్రదేశ్‌లోని విదిశా జిల్లాలో కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు పెద్ద సాహసాలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి డ్యామ్ స్థంభాలపై నుంచి దూకుతున్నారు.ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) దీనిపై స్పందించింది. ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది.13 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కు తమ పిల్లలను పంపకుండా ఆపడమా లేక ప్రమాదకరమైన ఈ షార్ట్‌కట్ మార్గంలో వారిని పంపడమా అనే రెండు మార్గాలే వారి తల్లిదండ్రులకు మిగిలాయని తెలిపింది.