తమిళనాడు రాజకీయాల్లోనూ, కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ గత కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విజయ్‌తో దాంపత్య బంధానికి స్వస్తి పలకాలంటూ కోర్టును ఆశ్రయించిన ఆయన భార్య సంగీత, తాజాగా తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. హఠాత్తుగా సంగీత తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం తమిళ రాజకీయ,సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి గల అసలు కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.