ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు అధికారికంగా చట్టంగా మారింది. జాతీయ గేయం వందేమాతరానికి ఇప్పుడు జాతీయ గీతం జనగణమనతో సమానమైన చట్టపరమైన రక్షణ లభించింది. ఇప్పటివరకు 1971 నాటి చట్టం కింద జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం జనగణమనకు మాత్రమే రక్షణ ఉండేది. ఇప్పుడు వందేమాతరం కూడా అదే పరిధిలోకి వచ్చింది.