ఉచిత పథకాలతో సమాజానికి తీవ్ర నష్టం అని తెలంగాణ హై కోర్టు తెలిపింది. కోటీశ్వరులు కూడా రైతుబంధు పొందుతున్నారని, ఇది చాలా బాధాకరమని, రైతుబంధుతో రాష్ట్ర ఖజానాకు భారమని సూచించింది.. ఐఎస్ సందీప్ సుల్తానియా కేసు విచారణలో హైకోర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. సందీప్ సుల్తానియాపై వెయ్యి కేసులున్నాయని, అవన్నీ విచారణ చేస్తే జీవితకాలం జైల్లో ఉండాలని హెచ్చరించింది. ప్రభుత్వాలు చేసిన తప్పులతో అధికారులకు ఈ పరిస్థితి ఏర్పడిందని, అధికారులను కోర్టుకు పిలిపించడం తమకు కూడా బాధకు ఉందని హైకోర్టు పేర్కొంది