ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శిరోమణి అకాలీదళ్ (సాద్) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శుక్రవారంనాడు కలుసుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు హౌస్‌లో ఉభయులు భేటీ అయ్యారు.సమావేశం వివరాలు వెల్లడి కానప్పటికీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరు కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో పాత మిత్రపక్షాలు మళ్లీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోచేతులు కలిపే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.సాగు చట్టాల అంశంపై ఆరేళ్ల క్రితం ఎన్డీయే నుంచి ‘సాద్’ వైదొలిగింది. ఎన్డీయేలో 20 ఏళ్లుగా సాద్ కొనసాగింది.