ఇద్దరి విద్యార్థుల మధ్య గొడవ నిలువరించే క్రమంలో దుర్భాషలాడిన టీచర్‌పై ఓ పదోతరగతి విద్యార్థి దాడి చేశాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి సదరు టీచర్‌పై పిడిగుద్దులు కురిపిస్తుండగా.. అక్కడే ఉన్న విద్యార్థులు, టీచర్లు అతన్ని అడ్డుకున్నారు. మా అమ్మను తిడతాడా..? అని ఆ విద్యార్థి అంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

