తమిళ స్టార్ హీరో విక్రమ్ అరుదైన జాతికి చెందిన లార్ గిబ్బన్ కోతితో ఆడుకుంటున్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో సదరు కోతిని అనుకరిస్తూ విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. కొందరు దీన్ని చూసి లైక్ కొట్టగా మరికొందరు మాత్రం వన్యప్రాణి సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అరుదైన జాతి కోతి.. విక్రమ్ దగ్గరకు ఎలా వచ్చింది? దీనిని పెంపుడు జంతువులా పెంచుకోవచ్చా అని పలు సందేహాలు రేకెత్తించారు. దీంతో విక్రమ్ తన వీడియోని డిలీట్ చేశాడు.