దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు శాసనసభ మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. వైద్య విద్యలో పారదర్శకతను కాపాడుతూనే, అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకు ప్రైవేటు కోచింగ్ సెంటర్లు విపరీతంగా పెరిగిపోయాయని, అవి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను లూటీ చేస్తున్నాయని ఈ తీర్మానంలో ఆరోపించారు. పాఠశాల విద్యా ప్రమాణాల ప్రాతిపదికన 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.