కొత్త యూట్యూబర్లకు కష్టకాలం వచ్చింది. మానిటైజేషన్ కు అవసరమైన వాచ్ టైం యూట్యూబ్ రెట్టింపు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం గత 365 రోజుల్లో 8,000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ లేదా గత 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ట్స్ వీక్షణలు ఉండాలి. 1,000 మంది సబ్ స్క్రైబర్లు ఉండాలనే నియమంలో మాత్రం ఎటువంటి మార్పు లేదని తెలిపింది. ఇప్పటికే యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ లో ఉన్న క్రియేటర్లపై ఈ ప్రభావం ఉండబోదని పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1నుంచి ఇది అమల్లోకి వస్తుంది.