మాజీ మంత్రి కొండా సురేఖ తనకు సారీ చెప్పడంపై కేటీఆర్ స్పందించారు. ‘నిజం నిలకడ మీద తేలుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. మొన్న ఒక పత్రిక నాకు సారీ చెప్పింది. ఈ రోజు మేడం (కొండా సురేఖ) క్షమాపణలు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ, విద్యుత్తు కుంభకోణం.. ఇలా తప్పుడు ఆరోపణలు చేసిన వారు కచ్చితంగా భవిష్యత్తులో సారీ చెబుతారు. లీగల్ టీంతో చర్చించిన తరువాత ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచించుకుంటాం’ అన్నారు.