జైలులో శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు, ఆయన భార్య బుష్రా బీబీకి భారీ ఊరట లభించింది. వారిద్దరినీ అందరికీ దూరంగా, ఒంటరిగా ఉంచకూడదని జైలు అధికారులను పాక్ హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు.. వారు జైలులో తమ బంధువులను కలిసేందుకు, తమ పిల్లలతో ఫోన్లో మాట్లాడేందుకు అనుమతివ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్, అతడి భార్య బుష్రా బీబీ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.