పండుగల సీజన్ సమీపిస్తున్న చక్కెర ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు హోల్‌సేల్ డీలర్లు తమ వద్ద ఉంచుకునే చక్కెర స్టాక్ పరిమితిని సగానికి తగ్గించారు. ఇప్పటివరకు ఉన్న 4 వేల క్వింటాళ్ల నిల్వ పరిమితిని ఇకపై 2 వేల క్వింటాళ్లకు కుదించారు. వ్యాపారులు కొనుగోలు చేసిన సరుకును కేవలం 30 రోజుల్లోపు విక్రయించాలని స్పష్టం చేశారు. కోల్‌కతా మరియు కొన్ని ప్రత్యేక ప్రాంతాలకు పాత నిబంధనే వర్తిస్తుందని తెలిపారు.