కావేరి జలాల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. కర్ణాటకకు 70 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలని కోరుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రైవేట్ సొసైటీల పిటిషన్లు చెల్లవన్న సుప్రీంకోర్టు.. అంతర్రాష్ట్ర నీటి వివాదాల్లో మూడో వ్యక్తులు లేదా సొసైటీలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. సొసైటీల పిటిషన్లను విచారిస్తూ పోతే వివాదాలు ముగియవని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.