మలేషియాకు పర్యాటక వీసాపై వెళ్లే భారతీయులకు కౌలాలంపూర్ లోని భారత హైకమిషన్ అత్యవసర సూచనలు జారీ చేసింది. 30 రోజుల ఉచిత వీసా వెసులుబాటును ఉపయోగించుకుని ఉద్యోగాల వేట కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. దీనివల్ల అక్రమంగా ఉండడం, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడం, డిటెన్షన్ లో పెట్టడం వంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. సరైన వర్క్ పర్మిట్, వీసా విత్ రెఫరెన్స్ లేకుండా ఉద్యోగం కోసం మలేషియాకు ప్రయాణించవద్దని హైకమిషన్ విజ్ఞప్తి చేసింది.