నిమజ్జన ఏర్పాట్లు మరియు భద్రతా చర్యల నేపథ్యంలో భక్తులకు ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి దర్శన భాగ్యం బుధవారం (ఈ నెల 23) రాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఆ తర్వాత భక్తులను అనుమతించడం కుదరదని ఉత్సవ కమిటీ ప్రతినిధులు మరియు పోలీసులు స్పష్టం చేశారు. గురువారం ఉదయం నుంచే మండపం వద్ద షెడ్లు, బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు వారు వెల్లడించారు. కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు.