ఈ నెల 24వ తేదీన విడుదల అవుతున్న నాని నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 23వ తేదీన ప్రత్యేక ప్రీమియర్ షో మల్టీప్లెక్స్‌లలో రూ.400, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.300ల పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 5 షోలకు పర్మిషన్ ఇచ్చింది. 10 రోజుల పాటు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌కు రూ.75లు, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50ల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది.