ఏపీలోని విశాఖపట్నానికి చెందిన షారోన్ నిఖితా టోప్నో అనే యువతి తన ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి మాదాపూర్లో సిద్దిఖీ నగర్లోని రోడ్ నంబర్-5లో ఉన్న ఓయోలో రూం బుక్ చేసుకుంది.అర్ధరాత్రి సమయంలో హోటల్ సిబ్బంది వద్దకు వచ్చిన రవితేజ.. తనతో వచ్చిన యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిందని తెలిపాడు. సిబ్బంది సాయంతో ఆమెను కొండాపూర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. యువతి మృతి చెందిన విషయం తెలియగానే ఆమె ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు.