వరంగల్ జిల్లాలో నిర్మాణం అవుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వేగంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే 30 రోజుల పాటు రోజుకు 24 గంటలు పని జరపాలని లక్ష్యం పెట్టారు. నిధులు ఇస్తున్నా పనుల్లో వేగం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రోజూ కలెక్టర్ ఆసుపత్రి పనులను చూసుకోవాలన్నారు. డిసెంబర్ లో ప్రారంభించుకునేలా అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు.