బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి సాహిల్ వాకోడే మృతితో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ ఐఐటీ బాంబే కీలక చర్య చేపట్టింది. క్యాంపస్‌లోని హాస్టళ్లలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో గోడలకు అమర్చే వాల్ మౌంటెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. అయితే ఈ మార్పు తాజా ఘటన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదని ఐఐటీ బాంబే వర్గాలు చెబుతున్నాయి ఐఐటీ బాంబేలోని హాస్టల్ గదుల్లో ఫ్యాన్లను మార్చడం ఒక్కటే విద్యార్థుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కాదని కొందరు విమర్శిస్తున్నారు