తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు విచారణ సుప్రీంకోర్టులో మరోసారి చర్చనీయాంశమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును పరిశీలిస్తోంది. తదుపరి తుది విచారణ తేదీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ త్వరలోనే వెల్లడించనున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.