ఏపీలో కూటమి సర్కార్ లో భాగమైన బీజేపీ డ్వాక్రా సంఘాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విచారణకు డిమాండ్ చేసింది.
ఈ మేరకు డ్వాక్రా సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఏపీ బిజెపి చీఫ్ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. మహిళలు అప్పుల చక్రంలో చిక్కుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రుణాల మంజూరులో బలవంతపు బీమాలు, అనధికార వసూళ్లపై విచారణ జరపాలన్నారు. ఆర్పీల ద్వారా పర్సంటేజ్ వసూళ్లను పూర్తిగా అరికట్టాలన్నారు.