నిజామాబాద్ జిల్లా పెర్కిట్ గ్రామంలో ఉన్న భరత్ చంద్ర హైస్కూల్‌లో హిందీ క్లాసులో విద్యార్థులకు ఉర్దూ బోధిస్తున్నారనే ఆరోపణలపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 1 నుండి 5 విద్యార్థులకు హిందీ బోధించేందుకు హుమా హానియా అనే ఉపాధ్యాయురాలిని నియమించారు. అయితే, ఆమె హిందీ సిలబస్‌ను పక్కనబెట్టి విద్యార్థులకు ఉర్దూ అక్షరమాలను నేర్పుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. స్కూల్ ప్రిన్సిపాల్ అమీర్ ఖాన్, కరస్పాండెంట్ మల్లయ్యలు విద్యార్థుల నోట్‌బుక్స్‌లో ఉర్దూ రాసి ఉన్న పేజీలను చింపేసినట్లు విచారణలో తేలింది.